"కిన్నెరాసాని వచ్చింది అమ్మ వెన్నెల పెట వేసి " అని ఎవేరో అన్నారు.
వెన్నెల ఏమిటి ..అమ్మాయి ఏమిటి అనుకునేవాడిని ..ఆ పాట విన్నప్పుడల ..కానీ ..ఆ కవి చెప్పింది నిజం అనిపించింది
అఖిలని అలా చూసి ...
ఆ కొబ్బరి తోటల మద్య ..అఖిల నవ్వుల కిల కిల
అనిపించేలా ఉంది గోదావరి ప్రవహం గల గల ..
అని మనస్సులో అనుకున్నాడు శ్రీ వత్స
"తన ఉండే సిటీలో ఎంతో మంది అందమయిన అమ్మాయిలను చూసాడు..కాని ఏదో చూడని వింత చుసినాప్పుడు ..పిల్లవాడు .పెట్టె అమాయకపు మొహం పెట్టి."అలాగే చూస్తున్నాడు శ్రీ
"ఒసేయ్ అఖిల !చూడు అక్కడ ఎవేరో ఉన్నారు"అంది రాధ
"ఎవేరు "అని చూసింది అఖిల
"ఓ ! అతన ..మా బావ అంట ..విజయవాడ నుంచి వచ్చాడు .."అంది అఖిల
"మన బావ నా"అంది రాధ
"మన లేదు నా లేదు "అంటూ
"మీరు ..ఇలా వచ్చారు ఎందుకు..అని అడిగింది అఖిల శ్రీ ని
"అది ఏమి లేదు..ఉరికే ఊరుని చూసి పోదాము అని "అన్నడు శ్రీ
"మా ఊరిలో ..కామేశ్వరీదేవి గుడి చూసారా ..చాల మహిమగల దేవత "అంది రాధ
"మీరు "అన్నాడు శ్రీ..
"ఇది నా ఫ్రెండ్ ,రాధ ..అంది "అఖిల
"హాయ్ రాధ !అని"హ్యాండ్ ఇచ్చాడు శ్రీ
"హాయ్ ..ఇంకా మా ఊరిలో చాల ఉన్నాయి "అంది రాధ
"రాధ !ఇందాక మీ అమ్మ పిలుస్తుంది అన్నావు కాదా ..వెళ్ళు ..నేను అతనికి అన్ని చూపించి తీసుకువస్త వెళ్ళు అంది"అఖిల
రాధ కి ఆర్ధం కాలేదు ..ఏమి అయింది ఈ అమ్మాయికి ..అని
కానీ అది possessiveness అని ..అప్పుడు చెప్పిన అఖిలకి ఆర్ధం కాదు..
ఎందుకు రాధ ని పంపించిందో ..అఖిల కి ఆర్ధం కాలేదు
"చెప్పండి akhila గారు! ఇపుడు ఎక్కడికి "అన్నాడు శ్రీ
"అఖిల్ గారు అవసరంలే ..అఖిల "అంది
"ఓకే అఖిల !ఇప్పుడు ఎక్కడికి అన్నాడు "శ్రీ
"ముందు గుడి వెళ్దాం పదండి"అంది అఖిల
"అండి ఎందుకు ..శ్రీ అను లేదా బావ అను "అన్నాడు శ్రీ
"అంటే కొత్త కదా ..నాకు ఏమి మొహమాటం లేదు..బావ కష్టం కానీ ..శ్రీ ఓకే అంది "అఖిల
"ఓకే నీ ఇష్టం "అన్నాడు శ్రీ
alaa గుడికి వెళ్లి,అటు నుంచి తన పొలం చూసుకుని .."వారిద్దరూ ...ఇంటికి వచ్చారు
"ఏమిటే కన్నా !నువ్వు బావ వస్తునారు "అంది జానకమ్మ
"ఏమి లేదు తనకి ఊరిని చూపించి ..అది సరిలే పద నాకు ఆకలి "అండి అఖిల
"నువ్వు అన్నం వద్దు అన్నావు కదా ..నేను వండలేదు అంది "జానకమ్మ
"ఏమి పరవాలేదు ...మల్లి వండు" అంది అఖిల
"లేదు లే సరదాగా అన్న"
"బాబు !కాలు కడుకో ..భోజనం చేద్దాం అంది జానకమ్మ
"మావయ్య రాలేదా "ఇంకా అని అడిగాడు శ్రీ
"లేదు రా !అయన ఆ పొలం వెళ్తే..పెళ్ళాని కూడా పట్టించుకోరు.."అంది జానకమ్మ
"నీకు తెలుసా శ్రీ! అమ్మ కి సవతి ..ఆ పొలం అని"నవ్వింది అఖిల
"అది ఏమి మాటలే ..నీకు ఏమిటి..మీరు అనలేవ "అంది జానకమ్మ
బుంగ ముతి పెట్టింది అఖిల
"లేదు లే అత్తయా !నేనే అల పిలవామన్న "అన్నాడు శ్రీ
"అయిన .ఎందుకు అలా అన్నావు ..నేను శ్రీ అనే పిలుస్త "అంది అఖిల
"మొండి పిల్ల ..."అంటూ భోజనం పనిలో మునిగిపోయారు జానకమ్మ
భోజనం చేసి ఒక కునుకు తీసాడు .శ్రీ వత్స
---------------------------------------------------------------------------------------------------------
"శ్రీ..బాబు లేవ్వండి ..అమ్మ గోరు పిలుస్తునారు "అన్ని పిలుపుకి మెలుకువ వచ్చింది
"ఆ వస్త్తున పద "అని రాములుని పంపి ..స్నానం చేసి కిందకి వెళ్ళాడు శ్రీ
"హాయ్ "అన్నడు శ్రీ ..
"హాయ్ "అంది అఖిల
"ఏమిటి బాగా నిద్ర పోయారు ..సారీ నిద్రపోయవు అనుకుంట "అంది అఖిల
"ఆ బాగా నిద్ర పట్టింది ..nice place..nice air"అన్నడు శ్రీ
"ఆ అవును natural air..కదా..సో..ఏమిటి ఇప్పుడు ప్లాన్స్" అంది అఖిల
"ఏమి లేదు..ఈ దేవిగారు ఎక్కడికి అయిన తిసుకువేల్ల్తే "అన్నడు శ్రీ
సరే అంటే బాగును అనుకున్నాడు శ్రీ
"అది తర్వాత ..ముందు ఈ పకోడీలు తిననండి "అంటూ వచ్చింది జానకమ్మ
"wow పకోడీ ...అంటూ "నోరు కాలుతున్న తిన్నాడం మొదలుపెట్టింది అఖిల
"నాకు పకోడీ అంటే చాల ఇష్టం ..అంటూ"తాను తిన్నాడు
ఫలహారం ..అయిన తరవాత
"మరి ఎక్కడికి ఇప్పుడు"అన్నడు శ్రీ
"ఎక్కడికి అంటే..అలా బయటికి వెళ్దాం "అని "అమ్మ నేను శ్రీ...కాదు కాదు బావ,నేను బయటికి వెళ్తున్నాము అని"చెప్పి ఇద్దరు బయటికి వచ్చారు
ఒకరి ఒకరి గురించి మొత్తం తెల్సుకున్నారు..ఇద్దరు
అలా వాళ్ళ అడుగులు ఒక రెండు గంటలు సేపు సాగాయి ..
అఖిల కి శ్రీ మాట తిరు నచ్చింది.
అమ్మాయిలకు ఎందుకు నచ్చుతామో ...ఆ దేవుడుకి తెలియదు
శ్రీ sense of humour బాగా నచ్చింది ..అఖిలకి
-------------------------------------------------------------------------------------------------------
అయిన మన జనాలు బాగా కష్టపడతారు కానీ మాస్టరు..
అమ్మాయిలు పాపం పెద్దగా ఏమి కోరుకోరు అండి .
ఒక మంచి మాట,రెండు కుళ్ళు జోకులు ,మూడు caringకారింగ్ కాల్స్,నాలుగు బహుమతలు ..
అయిన ఇందాక నుంచి మన హీరోయిన్ ని గురించి చెప్పను కానీ ..మన శ్రీ గురించి చెప్పలేదు
మన వాడు collegelo topper....ఏదో బుద్ధిగా ..చదువుకుని ..జాబు తెచ్చుకుని ..హ్యాపీ లైఫ్..మాట
అమ్మాయిలు పెద్దగా మనవాడి లైఫ్ లో లేరు..వచ్చిన పండగకి వచ్చిన అల్లుడులా ..వచ్చి వెళ్ళిపోతారు..
మన వాడు అమ్మాయిలు పట్టించుకోరు కానీ ..వీడిని మాత్రం వాళ్ళు పర్వాలేదు ..
మనవాడితో ఒకసారి మాటలాడితే అమ్మాయిలకి ఏదో ఒక impression కలుగుతుంది ..
అయిన ఏమి కావాలి అండి అమ్మాయిలకి ..మన లో మన మాట ..
బాగా చదువుకున్నాడు ..మంచి జాబు..చూడడానికి కెవ్వు కేక ..కాకపోయినా కేక ..
so..in general according to theroy of youth
"for every opposite gender,there will be attractive forces" అన్న విధంగా aa forces valla
ఇప్పుడు దాక 18మంది proposals ఉన్నాయి..
------------------------------------------------------------------------------------------------------------
ఇంకా కథ లోకి వద్దామా
అలా సాగుతున్న వాళ్ళ ప్రయాణంలో ..అఖిల ఒక్కసారి శ్రీవత్స ని ఒక్క పరిశీలనగా చూసింది
"ఫరవాలేదు చూడడానికి బాగునాడు "అనుకుంది అఖిల
అలా ఎందుకు ఆలోచించిందో అనుకుని నవ్వుకుంది అఖిల
"దేనికి ఆ నవ్వు ..మాకు చెప్తే మేము నవ్వుతముగా అన్నాడు"శ్రీ
"అబ్బే ఏమి లేదు..మీ హోబ్బీస్ అంది " అఖిల
"పెద్దగ ఏమి లేవు..అప్పుడు తవికలు రాస్తాను "అన్నాడు శ్రీ
"ఓ వావ్ ..అవునా..కవితలు అంటే ఎవెరి మిద రాస్తారు"అంది అఖిల
"ఎవేరు అని లేదు ..ఏదో అనిపించ్చి రాస్తా అన్నాడు "శ్రీ
"ఓ అవునా అయితే ..నా మిద రాయి ..అంది"అఖిల
పాలరాతిని పెట్టి ..బొమ్మగా చెయ్యమంటే ..శిల్పి పడే అనందం
అందం అయిన వెన్నెలలో కోకిల తీసే కూనిరాగం లోని అనందం ..
తెలియకుండా ఎందుకో .శ్రీ ఆ ఆనందమంకి లోనుయ్యాడు ..
"ఆ చెప్పుతాను "అని
అఖిల ..
నువ్వు మన్మన్దుడ్కి మరదలలా ..
అందంకి మనవ రూపంలా..
సుగునలకి స్త్ర్హి ఆకారంలా ..
ఉన్నవే ఓ మరదల పిల్ల ...
అని చెప్పాడు శ్రీ
"నన్ను పొగడ మంటే ..నిన్ను పొగుడు కున్నావు ఏమిటి "నవ్వుతు అంది అఖిల
"నన్ను ఎక్కడ"అని అమ్మయకయం అడిగాడు ..శ్రీ
"అబ్బో..ఏమి తెలియదు ..నాకు బావ నువ్వే కాదా..అంటే నువ్వేనే మన్మద్దువి .అంది"అఖిల
"ఓ ..నేను నీ బావ ..కాదా .నువ్వు శ్రీ అంటే ..నేను ఆ విషయం మర్చిపోయ "అన్నాడు శ్రీ
"అమ్మో కనపడవు కానీ కోతివి నువ్వు..బావ అని పిలవచ్చు అని చెప్పచ్చు అంది "అఖిల
"మరి పిలవచ్చుగా అన్నాడు "శ్రీ
"ఆశ దోస అప్పడం ..అప్పుదేనే ..ఏదో ఒక రోజు పిలుస్త ..సరే నే "అనేలోపు
"ఒసేయ్ ఏమిటీ ఇక్కడ నువ్వు..ఏమి చేస్తునావు..ఒసేయ్ అఖిల అన్న శబ్దం ఎక్కడో దూరం నుంచి
(ఇంకా ఉంది )

0 comments:
Post a Comment